వైఎస్సార్సీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత- కందుకూరులో టీడీపీ విజయం ఖాయం: ఇంటూరి - Inturi Nageswar Rao Interview - INTURI NAGESWAR RAO INTERVIEW
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 3:10 PM IST
Kandukur TDP Candidate Inturi Nageswar Rao Interview: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమకు అదనపు బలం అని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ నేపథ్యంలో ఎక్కడికి పోయినా టీడీపీకి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని అన్నారు. కందుకూరు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ అభ్యర్థి కందుకూరి ఇంటూరి నాగేశ్వర్‌రావు మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.
"వైఎస్సార్సీపీ పాలనలో దాడులు పెరిగాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎక్కడికి పోయినా టీడీపీకి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా సగం విజయం సాధించాం. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు అదనపు బలం. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగింది. కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం." - ఇంటూరి నాగేశ్వర్‌రావు, కందుకూరు టీడీపీ అభ్యర్థి