పొగతాగడం ఆరోగ్యానికే కాదు వాహనాలకూ హానికరం - ఇక్కడ ఏం జరిగిందో చూడండి - Kalyandurg Fire Video viral in ap - KALYANDURG FIRE VIDEO VIRAL IN AP
Published : Aug 22, 2024, 12:52 PM IST
Kalyandurg Fire Accident Video in AP : సాధారణంగా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ పొగతాగడానికి వెలిగించే అగ్గిపుల్ల కూడా ప్రమాదకరమేనని ఈ సంఘటనను చూస్తే అర్థం అవుతుంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సిగరేట్ వెలిగించడానికి అగ్గిపుల్లను తీసి వెలిగించాడు. అనంతరం ఆ పుల్లను కిందపడేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. మరోవ్యక్తి అక్కడే ఉన్న బైకును పక్కకు తీసేశాడు. దీంతో ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి కాకుండా ఉంది. పట్టణంలోని టీ కూడలి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఓ వ్యక్తి ప్లాస్టిక్ క్యాన్లో ఐదు లీడర్ల పెట్రోల్ తీసుకొని వెళుతున్నాడు. ప్రమాదవశాత్తు క్యాన్ పగిలిపోయి పెట్రోల్ అంతా రోడ్డు మీద వృథాగా పడిపోయింది. ఈ విషయాన్ని గమనించని మరో వ్యక్తి సమీపంలోనే బీడీ అంటించుకుని అగ్గిపుల్లను రోడ్డు మీద వేశాడు. దీంతో మంటలు చెలరేగి రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలు, ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం చేరడంతో పరిస్థితిని పర్యవేక్షించారు.