జూరాలకు భారీగా వరద ప్రవాహం - 45 గేట్లు ఎత్తి నీటి విడుదల - Jurala Dam Gates Opened - JURALA DAM GATES OPENED
Published : Aug 31, 2024, 12:55 PM IST
Jurala Dam 45 Gates Opened : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి 3 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో దిగువకు 3 లక్షల 5 వేల క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 19 వేల 20 క్యూసెక్కుల చొప్పున మొత్తం 3 లక్షల 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత 7.97 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లకు గాను ప్రస్తుత నీటిమట్టం 317.67 మీటర్లు ఉంది. జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతోపాటు నెట్టెంపాడు, బీమా కోయిల్‌సాగర్ నుంచి సాగు నీటి కోసం నీటిని విడుదల చేస్తున్నారు.