ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కెమికల్ డిప్లొమా కోర్సులపై యువత ఆసక్తి - పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

GICE in Visakhapatnam: దేశంలో పారిశ్రామిక రంగం వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫార్మా వంటి రంగాలకు మరింత ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కెమికల్ డిప్లొమా కోర్సులు చేయాలని యువత ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి విశాఖలోని గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల డిప్లొమా కోర్సులను అందిస్తోంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు ఈ కోర్సులు చేయవచ్చు.

మరి కోర్సు అనంతరం ఉద్యోగ అవకాశాలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఈ కోర్సులు చేస్తే  జాతీయ సంస్థలతో పాటుగా, పలు ప్రైవేట్, ఫార్మాసంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని జీఐసీఈ ప్రిన్సిపల్‌ డా. కేవీ రమణ పేర్కొన్నారు. హెచ్​పీసీఎల్​ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగ నియామక పరీక్షలో తమ విద్యార్థులు పోటీ పడే విధంగా  ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తద్వారా ఇప్పటివరకు దాదాపు వంద మంది వరకు అందులో ఎంపికైనట్టు వివరించారు. పరిశ్రమల్లో పని చేసే వారి కోసం ప్రత్యేకంగా సాయంకాలం డిప్లొమా కోర్సులను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. ఇవి యువత తమ అర్హతను పెంచుకోవడానికి, మంచి జీత భత్యాలను పొందడానికి అవకాశాలను దక్కించుకునేందుకు ఉపకరిస్తాయని అంటున్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details