ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అందరూ ఉద్యమిస్తే ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తాం: జేడీ - JD Lakshmi Narayana

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 5:20 PM IST

JD Lakshmi Narayana on AP Special Status: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (Budget Sessions of Parliament) కేంద్రానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున మన ఎంపీలు మిగతా రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టి బడ్జెట్ పాస్‌ కానివ్వకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హొదా, విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు చక్కటి అవకాశం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అందరూ ఉద్యమిస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు. జై భారత్ పార్టీ మెనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు అన్ని గ్రామాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఉద్యమిస్తామని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details