ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'టీటీడీ ఈవోపై కేసు నమోదు చేసి పాస్‌పోర్ట్‌ సీజ్ చేయండి' - సీఐడీకి జనసేన ఫిర్యాదు - Janasena leaders Complaint against TTD EO - JANASENA LEADERS COMPLAINT AGAINST TTD EO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 6:54 PM IST

Janasena Leaders Complaint to CID about TTD EO Dharma Reddy : అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు టీటీడీ ఈవోగా కోనసాగిన ధర్మారెడ్డి వందల కోట్ల రూపాయలు దోచేశారని జనసేన నాయకులు ఆరోపించారు. దీనిపై తిరుపతిలోని సీఐడీ కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌ కిరణ్‍ రాయల్‍ మాట్లాడుతూ, ప్రస్తుతం కూటమి అధికారంలోకి వస్తుండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో ధర్మారెడ్డి టీటీడీని నాశనం చేశారని విమర్శించారు. అతనిపై కేసు నమోదు చేసి, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని కిరణ్‍ రాయల్‍ డిమాండ్ చేశారు.

అలాగే పవిత్రమైన తిరుమల కొండపై ఎంతో మందిని ధర్మారెడ్డి ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అతని హయంలో వందల కోట్ల డబ్బు తిరుమల నుంచి అక్రమంగా తరలిపోయిందని కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్​కు చెందిన ఏవీ ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు గత నెల మే 14తో ముగిసింది. అప్పటి సీఎం జగన్ కోరిక మేరకు ఆయన పదవీ కాలం జూన్ 30వ తేదీ వరకు కేంద్ర పొడిగించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details