సీఎం జగన్ దేనికి సిద్దమో ప్రజలకు చెప్పాలి- జనసేన నేత పోతిన మహేష్ - Pothina Mahesh shocking comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 5:22 PM IST
Pothina Mahesh comments on YS Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమో, రాష్ట్ర ప్రజలకు చెప్పాలని జనసేన నేత పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సిద్ధమా, లేక దళితులపై దాడులు చేసేందుకు సిద్ధమా అంటూ మండిపడ్డారు. మద్యం అమ్మకాలు ెంచేందుకు సిద్ధమా, కూల్చివేతలకు సిద్ధమా! దేనికి సిద్ధమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
సలహాదారుల పేరుతో తనవారికి ప్రజాధనాన్ని దోచిపెట్టడుతున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. సలహాదారుల పేరుతో కేవలం ఒక్క సజ్జల రామకృష్ణరెడ్డికే రూ.140 కోట్లు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ఓటు వేసి మరోసారి రాష్ట్ర వినాశనానికి కారణమయ్యేందుకు సిద్ధంగా లేమని ప్రజలు చెబుతున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, రంగాలు సర్వనాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తిరగని వారు కూడా సీటు కోసం ప్రయత్నించడం శోచనీయమన్నారు. కొందరు నేతలు వ్యక్తిగాత ప్రయోజనాల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పోతిన ఆరోపించారు.