ప్రతిపక్షాల సీట్లు, పొత్తుల గురించి అధికార పార్టీకి ఎందుకు? : గాదె వెంకటేశ్వరరావు - Janasena allegations on YCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 3:36 PM IST
Janasena Leader Gade Venkateswara Rao on YCP Ministers: అధికారంలో ఉండి తమ శాఖలో ఏ పని చేయాలో తెలియని మంత్రులు జనసేన - టీడీపీ పొత్తులు, సీట్ల పంపకాల గురించి మాట్లాడుతున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన టికెట్లు ప్రకటించగానే వైసీపీ బ్యాండ్ మేళం బ్యాచ్ దిగి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎలా ఉండాలో అధికార పార్టీ చెబుతుందా అని ప్రశ్నించారు. వైసీపీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన మాదిరిగానే ఉందన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని చెప్పేవారికి భయమెందుకని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. మంత్రి అంబటి రాంబాబుకు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే టాస్క్ ఇచ్చారని, తన శాఖలో ఏం జరుగుతుందో పట్టించుకోని ఆయన జనసేన ఏం చేయాలో చెబుతారా అన్నారు. చెల్లని వేణు కూడా వచ్చి పవన్ కల్యాణ్‌పై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆయన సమర్థుడైతే జగన్ ఎందుకు వేరేచోటికి మారుస్తున్నారని ప్రశ్నించారు.