ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం: జనసేన నేత కిరణ్‌ రాయల్‌ - Kiran Royal On YSRCP Scam Tirumala - KIRAN ROYAL ON YSRCP SCAM TIRUMALA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 7:43 PM IST

Jana Sena Chief Kiran Royal On YSRCP Scam in  Tirumala : వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు. తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆక్రమణలను జనసేన నేత కిరణ్ రాయల్ పరిశీలించారు. శారదా పీఠం వెనుక ఐదు నక్షత్రాల హోటళ్లను తలపించేలా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు మఠాలను అద్దెకు తీసుకుని భక్తుల నుంచి లక్షలు సంపాదిస్తున్నారన్నారని మండిపడ్డారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చివేయాలని ఈవోకు ఫిర్యాదు చేస్తామని కిరణ్‌ రాయల్‌ చెప్పారు. 

ఇటీవల విశాఖ శారదా పీఠానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం విధితమే. తిరుమల తిరుపతి దేవస్థానంలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలంటూ హై కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల గోగర్భం డ్యామ్‌ వద్ద విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న రెండు భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details