ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాలెంటైన్స్​ డే ఓ దేశద్రోహి సంస్మరణం అంట! మీకు తెలుసా? - వాలెంటైన్స్​ డే పై జన జాగరణ సమితి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 6:54 PM IST

Jana Jagarana Samiti Awareness on Valentine's Day In Visakha : ఫిబ్రవరి 14న వాలెంటైన్స్​ డే అని జరుపుకోవడం సరికాదని జన జాగరణ సమితి కార్యకర్తలు అన్నారు. వాలెంటైన్స్​డేపై విశాఖలోని ఎంఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జన జాగరణ సమితి కార్యకర్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు జన జాగరణ సమితి వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజు పేరుతో జరిగే విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, అమ్మాయిలపై జరిగే హింసకు, మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా వ్యతిరేకం అని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు అన్నారు.

Valentine's Day : రోమ్ దేశానికి చెందిన దేశద్రోహి సెయింట్ వాలెంటైన్​ను ఉరి తీసిన రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోవాల్సిన గత్యంతరం మన దేశానికి లేదన్నారు.  వాలెంటైన్స్​ డేను పాకిస్తాన్​ అధికారికంగా నిషేధించిందన్నారు. ఇటువంటి పనికిమాలిన దినోత్సవాలు కారణంగా మన దేశంలో పవిత్రమైన వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details