రాష్ట్రాభివృద్ధి, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా జై భారత్ మేనిఫెస్టో: లక్ష్మీనారాయణ - జేడీ లక్ష్మి నారాయణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 3:57 PM IST
Jai Bharat National Party People Manifesto Release: జై భారత్ నేషనల్ పార్టీ ప్రజా మేనిఫెస్టోను పార్డీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. ప్రజా మేనిఫెస్టో పేరుతో పారదర్శకత, సుపరిపాలన, వ్యవసాయం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, మద్యపాన నిషేదం వంటి అనేక అంశాలతో ఈ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. రాజకీయ స్వలాభాన్ని విడనాడి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం తమ పార్టీ తీసుకున్న నిర్మాణత్మక నిర్ణయాలు ఈ ప్రజా మేనిఫెస్టోలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ మేనిఫెస్టోను ప్రజాదరణ పొందెలా రుపొందించామని లక్ష్మీ నారాయణ తెలిపారు. కరెంటు, మౌళిక సదుపాయాలు, నదుల అనుసంధానం, ఉద్యోగుల సంక్షేమం, రాష్ట్రానికి వనరులు ఎలా తీసుకురావాలి వంటి మరిన్ని అంశాలను క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి ఈ మేనిఫెస్టోను రుపొందించామని ఆయన వెల్లడించారు.
ప్రజా మేనిఫెస్టో అనేది ఎందుకంటే ఇంతవరకు పార్టీలు మేనిఫెస్టో తయారుచేసి ప్రజల మీద రుద్దారు. ప్రజా మేనిఫెస్టో అన్నది మేము ఎప్పటినుంచో ఆలోచించాం. అందుకే ప్రజలు ఇచ్చిన సూచనల మేరకు ఈ మేనిఫెస్టో రూపొందించాం. అన్ని రంగాలలో ఉన్నవారికి ఉపయోగపడేలా ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది.-జేడీ లక్ష్మీ నారాయణ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు