కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు : జగ్గారెడ్డి - Jagga Reddy Satires on Kishan Reddy - JAGGA REDDY SATIRES ON KISHAN REDDY
Published : May 24, 2024, 7:51 PM IST
Jagga Reddy Satires on BJP Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అధ్యక్షుడు జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని చెప్పిన కిషన్ రెడ్డి మాటలను తాము స్వాగతిస్తున్నామని అదే జరిగితే తాము సన్మానం చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నాయకులు ఆరితేరారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అయిదేండ్లు సీఎంగా ఉంటారని కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్ అని వెల్లడించారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎప్పుడు పడదని, కానీ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడటం సంతోషంగా అనిపించిందని వ్యాఖ్యానించారు. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదన్న విషయం తేలిపోయిందని అన్నారు. అందుకే రోజుకో బాషా రోజుకో వేషం వేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు కేటీఆర్, హరీష్లతో కలిసి దందాలే చేశారా..? అని నిలదీశారు. మీరు దందాలు చేసినందున తాము కూడా చేశామని అనుకుని భ్రమ పడుతున్నారా అని ప్రశ్నించారు.