ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సమస్యలు పరిష్కారం కావాలంటే పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలి: జేఏసీ నాయకులు - JAC leaders protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 4:33 PM IST

JAC Leaders Protest To Form Polavaram District: పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ (Joint Action Committee) ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని ఏటిగట్టు సెంటర్ వద్ద నిర్వహించిన సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సైతం పాల్గొని పోలవరం జిల్లా కావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు పోలవరం జిల్లా (polavaram District) ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు ముంపు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. 

జిల్లా ఏర్పాటు వల్ల పశ్చిమ ఏజెన్సీ గిరిజన మండలాల రాకపోకలకు అనువుగా ఉంటుందనీ, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరించడానికిి కలెక్టరేట్​, ఎస్పీ ఆఫీస్ రావాలని మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పేర్కొన్నారు. రంపచోడవరం ఏజెన్సీ నుంచి 250 కి.మీ దూరంలో జిల్లా కేంద్రం పాడేరు ఉండటంతో ఇక్కడి గిరిజన ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఇక్కడ అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని జేఏసీ సభ్యులు హెచ్చరించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details