YUVA : ''లా' అంటే కోర్టుల్లో వాదించడమే కాదు - అందులోనూ ఎన్నో వినూత్న కోర్సులున్నాయ్' - NALSAR UNIVERSITY VC INTERVIEW - NALSAR UNIVERSITY VC INTERVIEW
Published : Jun 20, 2024, 3:37 PM IST
Law Course Opportunities in Nalsar University : న్యాయవిద్య(లా) చదువు పట్ల ఎందరికో ఆసక్తి ఉంటుంది. అయితే న్యాయవిద్య చదివితే కేవలం కోర్టుల్లో వాదనలు చేసి కేసులు గెలిస్తేనే భవిష్యత్తు అన్న ఆలోచన కొందరిని వెనక్కి లాగుతుంది. అయితే రోజురోజుకు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల్లో మొదలు, రియల్ ఎస్టేట్ రంగం వరకు లాయర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరిచయం చేస్తోంది నల్సార్ యూనివర్శిటీ. దీంతోపాటు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించేలా ఆన్లైన్ కోర్సుకు సైతం శ్రీకారం చుట్టింది. జులై నుంచి ఈ కోర్సును అడ్మిషన్లను ప్రారంభించనున్నారు. పదో తరగతి పాసైన వారికి సైతం ఈ కోర్సులో ప్రవేశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో నల్సార్ వర్శిటీలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన లా కోర్సులు, లా విద్యార్థులకు ఉన్న అవకాశాలపై వర్శిటీ వీసీ డాక్టర్ శ్రీకృష్ణదేవరావుతో ముఖాముఖి ఇవాళ్టి యువలో చూద్దాం.