ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంద్రాగస్టు వేడుకలు - Independence day On Indrakeeladri - INDEPENDENCE DAY ON INDRAKEELADRI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 5:06 PM IST
Flag hoisting On Indrakeeladri : రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఓం- మలుపు వద్ద స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఆలయ ఈవో కేఎస్. రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటాలకు ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పుష్పాలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ సిబ్బంది, హోం గార్డులు, దేవస్థాన రక్షణ సిబ్బంది నుంచి ఈవో గౌరవ వందనం స్వీకరించారు.
Independence Day Celebrations On Indrakeeladri : ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వయంగా ప్రసాదం పంచారు. ప్రాంగణ అంతా వందేమాతరం అనే నినాదంతో మారుమోగింది. ఎందరో వీరుల త్యాగఫలమైన స్వాతంత్య్రన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని వారందరి కీర్తిని నలుచెరుగులా చాటాలని ఆలయ ఈవో అన్నారు.