ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అధికార పార్టీ నేతల అండదండలు - యథేచ్చగా కొనసాగుతున్న ఇసుక దందా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 5:15 PM IST

Illegal Mining Mafia: అధికారుల బదిలీలతో అక్రమార్కులు సహజ వనరులను యథేచ్చగా దోపిడీ చేస్తున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నిబంధనలకు పాతరేస్తూ భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. అనుమతుల్లేకుండా నిత్యం వేలాది లారీల్లో ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఆయా ప్రాంతాల్లో ఇసుకాసురులు పేట్రేగిపోతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Illegal Sand Mining in AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న సమయంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వేదవతి నదిలో ఇసుక, మట్టిని పట్టపగలే యంత్రాలతో తరలించేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇసుక తరలింపుతో నది ఒడ్డున భారీ గోతులు ఏర్పడ్డాయి. అక్రమ తవ్వకాలతో పర్యావరణం నాశనమవుతోందని, ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సాగునీటి వనరులు పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఉద్యోగుల బదిలీలు అక్రమార్కులకు వరంగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details