ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఏం చేయాలో రెండేళ్ల నుంచే ప్లాన్​' - ఇంజనీరింగ్ అద్భుతం సృష్టించిన కన్నయ్యనాయుడు - HydroMechanical Engineer Kannaiah - HYDROMECHANICAL ENGINEER KANNAIAH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 11:50 AM IST

Updated : Aug 21, 2024, 11:55 AM IST

Hydro Mechanical Engineer Kannaiah Naidu Exclusive Interview : తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు చెందిన గేట్ల జీవితకాలం ముగుస్తోందని, ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణులు, విశ్రాంత ఇంజనీర్ నాగినేని కన్నయ్యనాయుడు తెలిపారు. ఇటీవల తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్​​లాగ్​ను విజయవంతంగా అమర్చి విలువైన నీటిని కాపాడిన ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు. గేట్లకు ప్రమాదం పొంచి ఉందని రెండేళ్ల క్రితమే తాను హెచ్చరించానన్న కన్నయ్యనాయుడు ఏదైనా జరిగితే ఏం చేయాలన్న విషయమై నాటి నుంచే ఆలోచించినట్లు వివరించారు. 

నాగార్జున సాగర్ గేట్ల పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని, సాగర్​తో పాటు అన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కన్నయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈనెల 10న తుంగభద్ర జలాశయం ప్రవాహంలో 19వ గేటు కొట్టుకుపోయింది. నీటి వృథాను అరికట్టడానికి సీఎం చంద్రబాబు డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని పిలిపించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించిన కన్నయ్య నాయుడుతో ఈటీవీ ముఖాముఖి. 

Last Updated : Aug 21, 2024, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details