హైదరాబాద్లో ఐటీ అధికారుల దాడులు - బీజేపీ నేత ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం
Published : Feb 18, 2024, 4:09 PM IST
Hyderabad IT Rides : హైదరాబాద్లోని ఓ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న అభియోగంపై సోదాలు నిర్వహించినట్లు అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటితో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సామంత్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. వీరి నివాసాల్లో అణువనువూ తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
IT Raids In Hyderabad : ఈ సోదాల్లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి స్పష్టత రాలేదు. ఐటీ అధికారులు ఏమీ వెల్లడించలేదు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందెల శ్రీరాములు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలపై పలు కోణాల్లో ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.