ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కడప జిల్లాలో జలయజ్ఞం ఇదేనా! గుక్కెడు తాగు నీటి కోసం నరకయాతన - huge water problem in ysr district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 8:35 PM IST

Huge Water Problem in YSR District : రాష్ట్రంలో వేసని కాలం ఇంకా పూర్తిగా మెుదలు కాకముందే ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. తాగేందుకు నీరులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని బద్వేల్ పట్టణంలోని గౌరీ శంకర్, మారుతామ, చెన్నంపల్లి కాలనీలలో ఈ పరిస్థితి నెలకొంది. తాగునీటి అవసరాలకోసం ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులు, కూళాయిలు సైతం సక్రమంగా పనిచేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వచ్చే గుక్కెడు నీటిని కూడా అధికారులు ఇష్టమొచ్చిన సమయాల్లో వదిలి తమకు నరకం చూపిస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సమయం సందర్భం లేకుండా అర్థరాత్రి ఒంటిగంట సమయంలో నీటిని వదులుతున్నారని వాపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులలో పగలు మెుత్తం పనులకు వెళ్లి రాత్రి సేదతీరే సమయంలో నీటిని వదలటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి వారం దాటినా నీళ్లురాని సందర్భాలు ఉన్నాయని తెలిపారు. దీంతో బయటినుంచి నీటిని కొనుక్కునే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చినప్పుడేమో సమస్యలు తీరుస్తామని నీతులు చెప్పే నాయకులు తరువాత మా వైపు కన్నెతైనా చూడటంలేదని వాపోతున్నారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరిచాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details