ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన - వినతులిచ్చేందుకు తరలివచ్చిన జనం - Chittoor JC Srinivas on cm tour - CHITTOOR JC SRINIVAS ON CM TOUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 12:58 PM IST

Number of People came to R & B Guest House in Kuppam : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఆర్​ ఆండ్‌ బీ అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో అతిథి గృహం కిక్కిరిసింది. కుప్పం నియోజవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి  ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వ్యక్తిగత, పలు సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వసతులు కల్పించామని చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఏ రంగానికి సంబంధించిన సమస్య అయినప్పటికీ వాటికి సంబంధించిన కమిటీలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామంటున్న జాయింట్ కలెక్టర్‌ శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.  

ABOUT THE AUTHOR

...view details