'శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు' - హిందూ సంఘాలు ఆగ్రహం - TIRUMALA LADDU ISSUE - TIRUMALA LADDU ISSUE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2024, 3:18 PM IST
Hindu Communities Protested Against Adulteration of Srivari Laddu Prasad : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది ఆరాధించే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
దేవునిపై నమ్మకం లేని వారు ట్రస్ట్‌లో సభ్యులుగా ఉండటం మూలంగానే జరిగిందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రస్ట్‌ను ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారని ఆరోపించారు. స్వామి వారి ప్రసాదంలో వినియోగించడానికి వీలు లేని పదార్థాలను ఉపయోగించి తిరుమల లడ్డూలను అపవిత్రం చేశారని మండిపడ్డారు. త్వరలోనే గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు చేపట్టిన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.