సార్వత్రికత ఎన్నికల్లో రౌడీషీటర్స్ పై నిఘా - HC Action on Rowdy Sheeters - HC ACTION ON ROWDY SHEETERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 7:51 PM IST
High Court Action on Rowdy Sheeters : రాష్ట్రంలో రౌడీషీటర్స్, నేరచరిత్ర ఉన్న వ్యక్తులపై పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని జై భీమ్ రావ్ భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ 297 ప్రకారం ఎన్నికలు సజావుగా సాగేందుకు రౌడీ షీటర్లపై నిఘా ఉంచి పోలీస్ పరేడ్ నిర్వహించాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల పాత్రపై అధికారులు దృష్టి సారించడం లేదన్నారు.
HC Responded on Suit Filed by Jai Bhim Rao Bharat Party President : ఇలాంటి వ్యక్తులు ఎన్నికలకు విఘాతం కలిగిస్తారని చట్టం నిర్దేశించిన దాని ప్రకారం ఎన్నికల కమిషన్, డీజీపీ తమ విధులు నిర్వహించాలని పిటిషనర్ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్ ఇచ్చిన అర్జీపై ఏం నిర్ణయం తీసుకున్నారో శుక్రవారంలోగా తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.