ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ప్రకాశం బ్యారేజీకి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, కన్నయనాయుడు - Heavy Rains in Andhra Pradesh - HEAVY RAINS IN ANDHRA PRADESH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 7:30 AM IST

Updated : Sep 2, 2024, 9:26 PM IST

Heavy Rains and Floods in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో కురుస్తోన్న భారీవర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఏకమై రహదారులను ముంచేయడంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎటూ వెళ్లలేని దుస్ధితిలో ప్రయాణికులు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు. రాయనపాడు స్టేషన్‌ను వరద ముంచెత్తింది.  పలు రైళ్లను నిలిపేసి బస్సులు, ట్రాక్టర్లతో ప్రయాణికుల తరలిస్తున్నారు. ప్రయాణికులతో బెజవాడ బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది. విజయవాడ నుంచి పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు సర్వీసుల ఏర్పాటు చేశారు. బెజవాడకు వచ్చిన జల ప్రళయంతో దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి తప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. సింగ్‌నగర్, కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకుందాం. 
Last Updated : Sep 2, 2024, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details