ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాజీ ఎంపీ ఎంవీవీకి జీవీఎంసీ షాక్ - వెంచర్ పనులు నిలిపివేయాలని ఆదేశాలు - Orders to stop MVV venture works - ORDERS TO STOP MVV VENTURE WORKS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 5:52 PM IST

GVMC Orders to Stop MVV Satyanarayana Venture: మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు జీవీఎంసీ షాక్ ఇచ్చింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ వెంచర్​లో జరుగుతున్న పనులకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. అశీల్ మెట్ టైకూన్ కూడలి వద్ద సీబీసీఎన్​సీ (CBCNC) స్థలంలో ఎంవీవీ వెంచర్ నిర్మాణం జరుగుతోంది. ఈ ఎంవీవీ పీక్ వెంచర్ నగర నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువ చేసే 4.5 ఎకరాలలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. 

ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ పేలుడు పదార్థాలను వినియోగించి బ్లాస్టింగ్ చేస్తోంది. దీనివల్ల సమీప భవనాల పునాదులు దెబ్బ తింటున్నాయని స్థానికులు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు చేపట్టిన జీవీఎంసీ కమిషనర్, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో జీవీఎంసీ కమిషనర్ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details