ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు - Court Denied Bail to Pinnelli - COURT DENIED BAIL TO PINNELLI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 9:20 PM IST

Guntur District Court Denied Bail to Macharla Former MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్​సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. కారంపూడి సీఐ, తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావుపై దాడి ఘటనల్లో గుంటూరు జిల్లా కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. ఈ రెండు కేసుల్లో పిన్నెల్లిపై అభియోగాల నేపథ్యంలో నెల్లూరు జైలులో రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో పిన్నెల్లి బెయిల్​ను గుంటూరు సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆ తర్వాత వైఎస్సార్​సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. తెలుగుదేశం శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఈవీఎం ధ్వంసం చేసి ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details