ETV Bharat / state

జగన్‌ పాలనలో ఆర్థికం అస్తవ్యస్తం - 2022-23 నాటి పరిస్థితులపై నీతి ఆయోగ్‌ విశ్లేషణ - NITI AAYOG FISCAL HEALTH INDEX 2025

నాడు దేశంలో చివరి నుంచి రెండో స్థానం - 18 పెద్ద రాష్ట్రాల్లో 17వ స్థానంలో ఏపీ

NITI Aayog Fiscal Health Index 2025
NITI Aayog Fiscal Health Index 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 11:31 AM IST

NITI Aayog Fiscal Health Index 2025 : ఏపీ ఆర్థిక ఆరోగ్యం జగన్‌ పాలనలో ఎంత దారుణంగా ఉందో నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. 2022-2023 ఆర్థిక ఏడాదిలో దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక పేరిట ఓ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. కాగ్, ఆర్‌బీఐతో పాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ద్వారా నీతి ఆయోగ్‌ ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించగా వాటిలో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచింది. నాడు పంజాబ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన స్థానంలో ఉండేవని పేర్కొంది.

NITI Aayog Fiscal Health Index 2025
నివేదిక విడుదల చేస్తున్న నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సుమన్‌బేరి, 16వ ఆర్థికసంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా, నీతిఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం (ETV Bharat)

శుక్రవారం నీతి ఆయోగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరి, సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో తొలి రెండు స్థానాలను ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ దక్కించుకోగా, చివరి రెండుస్థానాల్లో ఏపీ, పంజాబ్‌ నిలిచాయి. 2014-2015 నుంచి 2021-2022 మధ్య సగటున 13వ ర్యాంకులో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఆ తర్వాత 17వ ర్యాంకుకు పడిపోయింది. ఖర్చుల నాణ్యత విషయంలో 15, ఆదాయ సమీకరణ, ఆర్థిక హేతుబద్ధత విషయంలో 16, రుణసూచికలో 12వ ర్యాంకును రాష్ట్రం దక్కించుకొంది.

AP Ranks 17th in NITI Aayog Index : పంజాబ్, ఏపీ, కేరళ, పశ్చిమబెంగాల్ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నట్లు నీతి అయోగ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఆ సమయంలో తీవ్ర ఆర్థికలోటుతో సతమతమైందని పేర్కొంది. అప్పులతో పాటు వడ్డీ చెల్లింపులు పెరగడం రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక సమస్యగా మారినట్లు వివరించింది. మొత్తం వ్యయంలో రాష్ట్ర మూలధన వ్యయం 3.5 శాతంకి పరిమితమైందని వెల్లడించింది. 2022-23లో చేసిన అప్పుల్లో 4.4 శాతం మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చుచేసినట్లు వివరించింది.

2018-2019 నుంచి 2022-2023 మధ్య రాష్ట్ర సొంత ఆదాయ వార్షికవృద్ధి -6 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. మొత్తం ఆదాయంలో రాష్ట్ర సొంత ఆదాయం 2018-2019లో 64 శాతం ఉండగా, 2022-23 నాటికి అది 67 శాతంకే చేరినట్లు వెల్లడించింది. సొంత ఆదాయవృద్ధి రేటు 2018-2019లో 17.1 శాతం ఉండగా, 2022-23లో అది 9.8 శాతంకి పడిపోయినట్లు తెలిపింది. 2022-2023లో ఆర్థికలోటు జీఎస్‌డీపీలో 4 శాతం ఉందని, అది నిర్దేశిత లక్ష్యం 4.5 శాతం లోపే ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ 2014-2015లో 3, 2015-16లో 7, 2016-17లో 14, 2017-18లో 16, 2018-19లో 13, 2019-20లో 15, 2020-21లో 13, 2021-22లో 11, 2022-23లో 17వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

  • ప్రభుత్వ అప్పులు 2018-2019 నుంచి 2022-2023 మధ్య సగటున 16.5 శాతం మేర వృద్ధిచెందాయి.
  • 2022-23లో వడ్డీ చెల్లింపులు 15 శాతం మేర పెరిగాయి. 2018-2019 నుంచి 2022-2023 మధ్య ఇవి ఏటా సగటున (సీఏజీఆర్‌) 10 శాతం మేర పెరిగాయి.

విశాఖలో గ్రోత్‌ హబ్‌- ప్రణాళికలు సిద్దం చేస్తోన్న నీతి ఆయోగ్‌

2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం - CM CBN Meeting with NITI AAYOG

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.