రావి ఆకుపై రామోజీరావు చిత్రం - శ్రద్ధాంజలి ఘటించిన లీఫ్ ఆర్టిస్ట్స్ - Ramoji Rao Leaf Art Tribute - RAMOJI RAO LEAF ART TRIBUTE
Published : Jun 8, 2024, 8:39 PM IST
Ramoji Rao Leaf Art Tribute : అక్షరయోధుడు రామోజీరావు అస్తమయంపై, తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ సంతాపం తెలిపారు. రామోజీరావుపై ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని రావి ఆకుపై గీసి శ్రద్ధాంజలి ఘటించారు.
Ramoji Rao Passes Away : అదేవిధంగా ఆకుపై రామోజీరావు చిత్రపటాన్ని గీసి నివాళులర్పించాడు జగిత్యాలకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు. జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ జాతీయ పర్వదినాలు, ఇతర ప్రముఖమైన పండుగల సందర్భంలో చాక్ పీసు, బియ్యపు గింజ, తదితర సూక్ష్మ వస్తువులపై చిత్రాలు గీస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తాడు. ఇదే తరహాలో తనకు గుర్తింపుని ఇచ్చిన ఈనాడు, ఈటీవీని గుర్తు చేస్తూ రామోజీరావుకు నివాళులర్పించాడు.