ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గన్ పౌడర్ పేలి ఒకరు దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు - గన్ పౌడర్ పేలి వ్యక్తి మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 4:43 PM IST

Gun Power Blast Man Dead: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామనపూడిలో గన్ పౌడర్ పేలి ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఓ ఆక్వా రైతు దగ్గర పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు తుపాకీలో నింపేందుకు గన్‌ పౌడర్‌ తయారు చేస్తున్నారు. అయితే హఠాత్తుగా అది పేలటంతో రీటు బరో అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బికాస్‌ బరో అనే మరో వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అసోం రాష్ట్రానికి చెందిన వీరిద్దరూ చినకామనపూడి ఆక్వా రైతు వద్ద పని చేస్తున్నారు. రైతు చెరువులో రొయ్య పిల్లలను తినేందుకు వచ్చే పక్షులను వీరు తుపాకీతో కాల్చి చంపుతుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తుపాకీలో గన్​ పౌడర్ నింపుతుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. చెరువు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details