LIVE: శ్రీహరికోటలో జీఎస్ఎల్వీ- ఎఫ్14 ప్రయోగం - ప్రత్యక్షప్రసారం - GSLV F14 Launch Live
Published : Feb 17, 2024, 5:43 PM IST
|Updated : Feb 17, 2024, 6:17 PM IST
GSLV-F14 Launch at Satish Dhawan Space Centre: ఇస్రో మరో ప్రయోగం చేపట్టింది. ఇందుకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్((Satish Dhawan Space Centre) వేదిక కానుంది. వాతావరణ అధ్యయనానికి సంబంధించిన GSLV-F14 శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(Indian Space Research Organisation) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5 గంటల 35నిమిషాలకు జీఎస్ఎల్వీ- ఎఫ్14(GSLV-F14) ప్రయోగం జరిపారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO Set to Launch GSLV-F14) సర్వం సిద్ధం చేశారు.
Count Down to GSLV-F14 Launch: జీఎస్ఎల్వీ- ఎఫ్14 ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 2గంటల 5నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఏడాది రెండో ప్రయోగం రెండో వేదిక నుంచి జరగడం ఆసక్తిగా మారింది. జీఎస్ఎల్వీ- ఎఫ్14 వాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యప్రసారంలో మీరు వీక్షించండి.