LIVE : సచివాలయం వద్ద గ్రూప్-1 అభ్యర్థుల అరెస్ట్ - GROUP 1 CANDIDATES DHARNA LIVE
Published : Oct 19, 2024, 3:45 PM IST
|Updated : Oct 19, 2024, 5:40 PM IST
Group-1 Candidates Dharna Live : గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం ఇవాళ కూడా కొనసాగుతోంది. పరీక్ష యధాతథంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద వీరికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ముందుగు సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన BRS నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్‌లను గ్రూప్‌వన్ అభ్యర్థులు అడ్డుకున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గో బ్యాక్‌అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడకు బీజేపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడకు చేరుకున్నారు. గ్రూప్1 మెయిన్స్ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న ధర్నాను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Oct 19, 2024, 5:40 PM IST