ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వినూత్నంగా వృక్షా బంధన్- పురాతన వృక్షానికి రాఖీ - Vrikshabandhan in Visakha - VRIKSHABANDHAN IN VISAKHA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 8:54 AM IST

Grain Climate Foundation Celebrate Vrikshabandhan in Visakha : మహావృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గ్రీన్‌ క్లైమెట్‌ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అన్నారు. విశాఖలో సంస్థ ప్రతినిధులు రైల్వే స్టేషన్‌ సమీపంలోని పురాతన వృక్షానికి రాఖీలు కట్టి రక్షా బంధన్‌ నిర్వహించారు. చిప్కో ఉద్యమంలా వృక్షాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రత్నం పిలుపునిచ్చారు. పిల్లల పుట్టిన రోజున వారితో మొక్కలు నాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనమాలి గార్డెన్స్​, సమతా డిగ్రీ కళాశాల, వీఎస్​ కృష్ణ కళాశాల, పొలాక్స్​ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

వృక్షాబంధన్​ లాంటి వినూత్న కార్యక్రమం ద్వారా మొక్కలు రక్షించడం చాలా అభినందనీయమని అధ్యాపకులు పేర్కొన్నారు. ఇందులో తాము పాల్గొనటం చాలా ఆనందకరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చెట్లును ఏ విధంగా కాపాడుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని లాంటి అంశంపై గ్రీన్​ క్లైమెట్​ సంస్థ అవగాహన కల్పించారని తెలియజేశారు. చెట్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details