విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు - సాంకేతికతను అందిపుచ్చుకోవాలి : గవర్నర్ - Governor Justice Abdul Nazir - GOVERNOR JUSTICE ABDUL NAZIR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2024, 9:06 AM IST
Governor Justice Abdul Nazir Attended Graduation Ceremony at VIT University : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తమ శక్తియుక్తులను వినియోగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాజధానిలోని విట్ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ వర్సిటీలో మెుక్కలు నాటారు. ప్రతిభ చాటిన డిగ్రీ, బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు.
VIT University : నిత్య విద్యార్థిగా ఉంటూ, నూతన సాంకేతికతను విద్యార్థులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించగలుగుతారని జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలియజేశారు. అనంతరం మహాత్మా గాంధీ సూక్తులను విద్యార్థులకు వివరించారు. ఉన్నత విద్యను బలోపేతంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని విట్ ఛాన్సలర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. రాష్ట్రానికి సరికొత్త విశ్వవిద్యాలయాలను ఆహ్వానించి ఉన్నతవిద్యను అందరికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.