ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ - Governor Visit Khairatabad Ganesh - GOVERNOR VISIT KHAIRATABAD GANESH
Published : Sep 7, 2024, 7:04 PM IST
Governor Jishnu Dev Varma Visit Khairatabad Ganesh : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు.. సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజలు చేసిన అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడా గణపతిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గవర్నర్ జిష్ణుదేవ్కు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీరాముని విగ్రహాన్ని బహూకరించారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, వచ్చే ఏడాది మరింత వైభవంగా వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రసంగం ఆఖరును శ్లోకాలు చదివి గవర్నర్ ఆకట్టుకున్నారు.
ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో ఈ రెండు రోజుల పాటు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడకి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈ పదకొండు రోజుల పాటు కూడా శ్రీనివాస కల్యాణం, శివపార్వతి కల్యాణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.