చంద్రబాబు ప్రమాణస్వీకారంపై ప్రభుత్వ ఉద్యోగుల హర్షం- మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు - Govt Employees Celebrations - GOVT EMPLOYEES CELEBRATIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 9:16 PM IST
Govt Employees Celebrations: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడంతో కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందోత్సవాలు జరుపుకొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించినందుకు తగిన గుణపాఠం చెప్పామన్నారు. గతంలో చంద్రబాబు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు.
"చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఇవాళ సువర్ణ అధ్యాయం. అరాచక, అన్యాయంపై విజయానికి గుర్తుగా సంబరాలు చేసుకునే రోజు ఇది. రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయి. జగన్ ప్రభుత్వం మా ఉద్యోగుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరించింది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నానాకష్టాలు పడ్డాం. ఈ నేపథ్యంలో మేమంతా కలసి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాం. చంద్రబాబు హయంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం." - ప్రభుత్వ ఉద్యోగులు, కర్నూలు