ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏకంగా 2 కిలోల బంగారు అభరణాలు - నెల్లూరులో గోల్డ్​మెన్ సందడి - సెల్ఫీలు దిగేందుకు స్థానికుల పోటీ - GOLDMAN IN NELLORE - GOLDMAN IN NELLORE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 7:45 PM IST

Goldman in Nellore Wearing 2 kg Gold Ornaments : నెల్లూరులో గోల్డ్ మెన్ సందడి చేశారు. ఏకంగా 2 కిలోల బంగారు అభరణాలు ధరించి నగర వీధుల్లో కలియ తిరిగారు. కర్ణాటకు చెందిన రెజీమోన్ అనే వ్యక్తి రెడ్ ల్యాండ్స్ అనే సంస్థలో రీజనల్ మేనేజర్​గా పని చేస్తున్నారు. నెల్లూరులో డీలర్లను కలిసిందుకు వచ్చిన రెజీమోన్ పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ధరించి ఓ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు. చేతులకు భారీ కడియాలు, వేళ్లకు ఉంగరాలు, మెడలో చైన్లు, చెవులకు రింగ్​లు పెట్టుకుని అటువైపు రావటం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

ఒంటినిండా బంగారం వేసుకుని తిరుగుతున్న రెజీమోన్​తో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. ఓ సింగర్​ను చూసి 2010 నుంచి తనకు బంగారు ఆభరణాలు ధరించే అలవాటు మెుదలైందని అతను తెలిపారు. ప్రస్తుతం రెండు కిలోల బంగారు ఆభరణాలు వేసుకున్న తాను, రాబోయే రోజుల్లో అయిదు కిలోల ఆభరణాలు ధరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు గోల్డ్ మెన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details