ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : డీజీపీ రవిగుప్తా - GHMC Voter Slip Distribution - GHMC VOTER SLIP DISTRIBUTION
Published : Apr 27, 2024, 3:20 PM IST
GHMC Commissioner Voter Slip Distribution In Hyderabad : మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల కోసం నగరంలో ఓటరు స్లిప్ ల పంపిణీ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ మొదలుపెట్టారు. బంజారాహిల్స్‌లోని డీజీపీ రవిగుప్తా నివాసానికి అధికారులతో కలిసి వెళ్లిన రోనాల్డ్ రాస్ రవిగుప్తకు ఓటరు స్లిప్, స్టిక్కర్ అందేశారు. ఈ సందర్భంగా ఓటర్లు మే 13న తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని డీజీపీ రవిగుప్తా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.
అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను ఆయన నివాసంలో కలిసి రోనాల్డ్‌రాస్ ఓటరు స్లిప్ అందజేశారు. ఓటర్ స్లిప్, స్టిక్కర్ల పంపిణీ వివరాలను వికాస్‌రాజ్‌కు వివరించారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వికాస్ రాజ్ కోరారు.