పేలిన గ్యాస్ సిలిండర్ - కాలిబూడిదైన ఇల్లు - తప్పిన ప్రాణనష్టం - Gas Cylinder Blast In Suryapet
Published : Mar 9, 2024, 6:23 PM IST
Gas Cylinder Blast In Suryapet : రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వేసవి సమీపిస్తుండటంతో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. పౌరులు అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిదవుతుంటాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ పేలి పూరి ఇల్లు దగ్ధమైంది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మీగడంపాడు తండాలో అర్ధరాత్రి భూక్య బాబు తౌర్య ఇల్లు కరెంటు వైరు కాలడంతో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం దగ్ధమైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.
గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ : స్థానికులకు సమాచారం అందడంతో ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. సిబ్బంది వచ్చి మంటలు ఆర్పగా, అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ రూ.10,000, మాజీ ఎంపీటీసీ బెల్లంకొండ నరసింహారావుతో పాటు స్థానికులు తమ వంతు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.