జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు: గంటా శ్రీనివాసరావు - Ganta Campaign in Bheemili - GANTA CAMPAIGN IN BHEEMILI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 7:54 PM IST
Ganta Srinivasa Rao Election Campaign in Bheemili: రాష్ట్రంలో అమలు చేసే ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు భీమిలి తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గ మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి చేస్తానని ఆయన వివరించారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ జగన్ పాలనపై విసిగిపోయారని గంటా పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గంలో అయితే ఇది మరీ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
జగన్ పాలనకు విసుగుపోయిన నేతలు గ్రామాలకు గ్రామాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నాయని గంటా వివరించారు. భీమిలిలో భారీ మెజార్టీతో గెలుస్తానని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. 2014లో పోటీ చేసినప్పుడు భీమిలి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆదరణ ఎప్పుడు గుర్తుంటుందని గంటా శ్రీనివాసరావు అన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయగా ఇంకా మిగిలిఉన్న పనులను అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని గంటా శ్రీనివాసరావు హామి ఇచ్చారు. భీమిలిని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలన్నదే తమ లక్ష్యమని గంటా శ్రీనివాసరావు అన్నారు.