ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ ముఠా- 100 కిలోల గంజాయి స్వాధీనం - Cannabis in annamayya district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 5:54 PM IST

Ganja Criminals Arrest in  Annamayya District : అక్రమంగా 100 కిిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దుల నుంచి కారులో తరలిస్తున్న ఈ గంజాయిని అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం పోలీసులు పట్టుకున్నారు. పెద్ద తిప్పసముద్రం, ములకలచెరువు ప్రాంతాలలో తనిఖీ చేస్తున్న పోలీసులకు గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలు పట్టుబడ్డాయి. ఈ తనిఖీల్లో దాాదాపు రూ. 30 లక్షల విలువైన 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అదేవిధంగా రెండు కార్లను సీజ్‍ చేశారు. పోలీసులకు పట్టుబడినవారిలో మదనపల్లె, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట ప్రాంతాలకు చెందిన నాగరాజు, కోసువారి బాలాజి, ఓబులేసు అలియాస్ శ్యాంసంగ్, ఆవుల కొండయ్య, అక్కినపల్లె మల్లికార్జున, బైరిసెట్టి అనిల్‍ కుమార్​లు ఉన్నారు. అయితే మరో ఆరుగురు గంజాయి స్మగ్లర్లు పోలీసుల తనిఖీలను గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడినవారిలో కొందరూ గతంలోనూ గంజాయి రవాణా కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఒడిశా సరిహద్దుల నుంచి తరలిస్తున్న ఈ గంజాయిని బెంగళూరు నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details