తెలంగాణ

telangana

వాటర్ ట్యాంక్ కింద మహా గణపతి - సోషల్ మీడియాలో వైరల్ అయింది - Ganesha Mandapam on Water Tank

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 3:24 PM IST

Lord Ganesha Special Attraction (ETV Bharat)

Ganesha Mandapam on Water Tank: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో గణపయ్య వినూత్నంగా పూజలందుకుంటున్నాడు. వాటర్ ట్యాంక్ పై కొలువుదీరి భక్తుల నుంచి పూజలు అందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇరవై ఏళ్ల క్రితం రేవల్లి మండల కేంద్రంలోని వడ్లగేరిలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ మండపం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా భారీ వర్షాలకు వీధులన్నీ బురదమయంగా మారాయి. అప్పుడే అక్కడ కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మించారు. కింద బురదగా ఉండడంతో యువకులు, కాలనీవాసులు గణపతిని ట్యాంక్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసి పూజలు చేస్తూ వస్తున్నాం అని నిర్వాహకులు చెబుతున్నారు. 

నాటి నుంచి నేటి వరకు ఏటా అక్కడే బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. చెక్కలతో సెట్రింగ్ ఏర్పాటు చేసి క్రేన్ సాయంతో వినాయకుడి ప్రతిమను అక్కడ  ప్రతిష్ఠించినట్లు  నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో వానొచ్చినా.. వరదొచ్చినా ఎలాంటి ఇబ్బందీ లేదు. వాటర్ ట్యాంక్​పై కొలువుదీరిన ఈ వినాయకుడి ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details