తెలంగాణ

telangana

విశేషంగా ఆకట్టుకుంటున్న వెదురుబొంగుల వినాయకుడు - ఎక్కడంటే? - Ganesha idol Making with bamboo

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 3:59 PM IST

Ganesha Idol Making With Bamboo sticks (ETV Bharat)

Ganesha Idol Making With Bamboo sticks : వినాయక చవితి వచ్చిందంటే చాలు గణపతిని వివిధ రూపాల్లో తయారు చేసి కొలుస్తారు. జగిత్యాల జిల్లా రాయికల్​ మండలం భూపతిపూర్​ గ్రామానికి చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. విగ్రహం తయారీకి ఎటువంటి రసాయనిక పదార్థాలు వాడకుండా పర్యావరణహితంగా వెదురు బొంగులతో తయారు చేసి ఆ బొజ్జ గణపయ్యపై తనకు ఉన్న భక్తిని చాటుకున్నాడు. అతడు తయారు చేసిన వెదురుబొంగు వినాయకుడి విగ్రహం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  

పర్యావరణ హితమైన వినాయక విగ్రహాన్ని తయారు చేయాలని భావించే వెదురు వినాయకుడిని రూపొందించినట్లుగా ఊరె నర్సయ్య అనే కళాకారుడు తెలిపారు. వెదురుతో పలు కళాఖండాలను రూపొందినట్లు కూడా తెలిపారు. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటున్నారు. నగరంలో ఎటుచూసిన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. వాడవాడలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. కొందరు వినూత్నరీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details