వాగులో కొట్టుకుపోయిన బైక్- ప్రాణాలతో బయటపడిన నలుగురు యువకులు - Four Youths Escaped Safely - FOUR YOUTHS ESCAPED SAFELY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 6:37 PM IST
Four People Was Safe in Washed Away With Bike in Flood : వాగు ఉద్ధృతికి ద్విచక్ర వాహనంతో పాటు నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయి సురక్షితంగా బయటపడిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ముంచంగిపుట్టు మండలం బిరిగుడ వాగును దాటేందుకు బైక్‌ను మోసుకుని నలుగురు యువకులు వెళ్తుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. నలుగురు యువకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనం కోసం గాలిస్తున్నారు. వంతెన లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల బైక్‌పై వంతెన దాటేందుకు ఇద్దరు యువకులు సాహసం చేశారు. దీంతో నీటి ఉద్ధృతికి బైక్ జారిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి పరుగున అక్కడికి వచ్చి బైక్‌తో పాటు ఇద్దరినీ కాపాడారు. స్థానికులు లేనట్లయితే యువకులు బైక్‌తో పాటు వాగు ప్రవాహనికి కొట్టుకుపోయేవారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రహదారి సదుపాయం, వంతెనలు లేక గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు.