ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - Venkaiah Visited Khairatabad Ganesh - VENKAIAH VISITED KHAIRATABAD GANESH
Published : Sep 12, 2024, 1:42 PM IST
Ex Vice President Venkaiah Naidu Visited Khairatabad Ganesh : దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గణేశున్ని కోరుకున్నట్లు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇవాళ ఉదయం ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజలు అనంతరం పండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రజలందరం ధర్మబద్ధంగా నడవాలని, ధర్మ నిరతిని కాపాడాలని వెంకయ్య నాయుడు అన్నారు. ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడాలని దేవుడిని కోరుతున్నట్లు చెప్పారు.సెప్టెంబరు 7వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తొలి పూజను చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆతర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. ఈసారి 70 అడుగుల గణేశుడిని ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించారు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో గణేశుడిని తీసుకువస్తున్నారు.