మహిళ హత్య కేసు నిందితుల జాబితాలో నందిగం పేరు - Nandigam Suresh remand - NANDIGAM SURESH REMAND
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2024, 3:57 PM IST
Extension of remand for Nandigam Suresh : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి చేసిన కేసులో ఈ నెల 5న అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు వచ్చే నెల 3 తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 19 తో నందిగామ సురేష్ రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయనను మంగళగిరిలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి సురేష్ బాబు వచ్చే నెల 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిమాండ్ పొడిగించడంతో పోలీసులు నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. మరోవైపు 2021లో తుళ్లూరు మండలం వెలగపూడి లో మృతి చెందిన మహిళా కేసులో నందిగం సురేష్ పేరు ను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో సురేష్ ను అరెస్ట్ చేసేందుకు మంగళగిరి న్యాయస్థానంలో పిటి వారెంట్ దాఖలు చేశారు. అయితే, దీనిని పరిశీలించిన మంగళగిరి న్యాయస్థానం న్యాయమూర్తి, పూర్తి వివరాలతో పిటి వారెంట్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించారు.