ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనుచరుడి అక్రమ నిర్మాణం కూల్చివేత - మున్సిపల్​ సిబ్బందితో ద్వారంపూడి వాగ్వాదం - EX MLA DWARAMPUDI OVER ACTION - EX MLA DWARAMPUDI OVER ACTION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 9:32 AM IST

Authorities Demolish Illegal Construction : కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడు బళ్లా సూరిబాబు అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. స్థానిక 9వ డివిజన్‌ గొడారిగుంట ప్రాంతంలో జీ ప్లస్‌ వన్‌ భవనం నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెండో అంతస్తు నిర్మించడంతో నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. గడువు ముగియడంతో ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది పోలీసుల సహాయంతో అక్రమ కట్టడం కూల్చివేతకు యత్నించారు. 

Former MLA Dwarampudi Activist House : అనుచరులతో అక్కడికి చేరుకున్న చంద్రశేఖర రెడ్డి సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా  పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. కొద్ది సేపు నిరసన తెలిపి అక్కడి నుంచి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లిపోయారు. అనంతరం అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని మున్సిపాలిటీ సిబ్బంది కూల్చి వేశారు. సూర్యరావు నగరంలో పలు ప్రాంతాల్లో సామాన్యుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ సిబ్బందిని అడ్డుకుని దాడికి పాల్పడిన వారిపై కేసులు పెడతామని ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details