తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్​ నుంచి కేటీఆర్ మీడియా సమావేశం - KTR Live - KTR LIVE

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 2:03 PM IST

Updated : Sep 21, 2024, 2:23 PM IST

KTR Press Meet From Telangana Bhavan Live : మాజీమంత్రి, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కాంగ్రెస్​ను ఉద్దేశిస్తూ తెలంగాణ భవన్​లో నిర్వహించిన మీడియాతో మాట్లాడుతున్నారు.  హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పగపట్టారని, అందుకే ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి చిల్లర రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఎన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా, పార్టీ ఫిరాయింపులు సహా ఆరు గ్యారెంటీల అమలుపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, తమ పార్టీపై ఎదురుదాడికి దిగడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న మరణాలు ఒక కుటుంబ భవిష్యత్తు అనే కనీస సొయి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలని హితవు పలికారు. రేవంత్‌ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. అవన్నీ ఆయన మెడకే చుట్టుకుంటాయని హెచ్చరించారు.
Last Updated : Sep 21, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details