ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద బాధితులకు దుర్గ గుడి తరపున పులిహోర పొట్లాల పంపిణీ - Food Distribution to Flood Victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 6:58 PM IST

food_distribution_to_flood_victims (ETV Bharat)

Food Distribution to Flood Victims under Durga Malleswara Swamy Temple : వరద బాధిత ప్రాంతాల్లో దుర్గ గుడి తరఫున పులిహోర పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 50 వేల ప్యాకెట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 30 వేల ప్యాకెట్లు అందించినట్లు ఈఓ తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో రామారావు తదితరులు ఈ ప్యాకెట్లను సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో నేరుగా పంపిణీ చేశారు. 

ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్ వద్ద కొండ చరియలు విరిగిపడిన ప్రదేశాన్ని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కొండ రాళ్లు పడిన ప్రాంతాలను సందర్శించారు. భక్తుల వాహనాలను ఘాట్‌రోడ్డు ద్వారా దర్శానానికి అనుమతించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కనకదుర్గానగర్‌ నుంచి మెట్ల మార్గం ద్వారానే భక్తులను ఆలయానికి అనుమతించాలని చెప్పారు. దీనికి సంబంధించి దుర్గ ఈఓతో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details