తెలంగాణ

telangana

ETV Bharat / videos

మేడిగడ్డకు పెరిగిన వరద ఉద్ధృతి - తాత్కాలిక మరమ్మతుకు ఆటంకం - Flood Water Reaches Medigadda

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 11:48 AM IST

Flood Water Reaches Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద తాకిడి పెరగడంతో తాత్కాలిక మరమ్మతులకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ప్రవాహ ఉద్ధృతి వల్ల ఏడో బ్లాక్‌లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు పనులు సాగుతున్నాయి. ప్రధానంగా దెబ్బతిన్న 20వ పియర్, ఆ ప్రదేశం కింది భాగంలో ఇసుక, మట్టి, గ్రౌటింగ్ కొంత మేర కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే వచ్చే సమస్యలను అధిగమించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రింగ్ బండ్‌ తొలిగింపు పనులను వేగవంతం చేశారు. దిగువ ప్రాంతంలో పనుల కోసం వేసిన మట్టి రహదారులను తొలిగించి, నది ప్రవాహం సాపీగా సాగేలా యంత్రాలతో చదును చేస్తున్నారు. పలుమార్లు బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇంజినీరింగ్ అధికారులు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి 16 వేల 650 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details