ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోలవరం ప్రాజెక్టు వద్ద పోటెత్తుతున్న వరద- పాపికొండలు విహారయాత్రకు బ్రేక్ - Flood Water in Polavaram Project

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 2:07 PM IST

Flood Water Increasing in Polavaram Project: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గోదారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద క్రమేపీ నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద చేరుతున్న కారణంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ ఛానల్ ప్రాంతం జలాశయాన్ని తలపిస్తోంది. 

ప్రాజెక్ట్ స్పిల్ ఎగువ నీటిమట్టం 28.080 మీటర్లకు చేరింది. స్పిల్ వే ఎగువ 28.080 మీటర్ల నీటిమట్టం ఉంది. అదేవిధంగా ఎగువ కాపర్ డ్యాం వద్ద నీటిమట్టం 28.230 మీటర్లు ఉండగా, దిగువ కాపర్ డ్యాం నీటిమట్టం 17.570 మీటర్లకు చేరింది. వరద నేపథ్యంలో రెండు లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు వర్షాల నేపథ్యంలో గోదావరి వరద కారణంగా పాపికొండలు విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ఇటీవల కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా పోలవరంలో వరద ఉప్పొంగింది.

ABOUT THE AUTHOR

...view details