ETV Bharat / state

100% జాబ్​ గ్యారంటీ - పాలిటెక్నిక్​లో కొత్త కోర్సులు - NEW COURSES IN POLYTECHNIC

పాలిటెక్నిక్ విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు - పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా 32 కొత్త కోర్సులు

New_Courses_in_Polytechnic
NEW COURSES IN POLYTECHNIC (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 11:23 AM IST

NEW COURSES IN POLYTECHNIC: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఏపీలో పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు ఇండస్ట్రీస్​కి అవసరమయ్యే మానవవనరుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం ఏపీని ఆరు క్లస్టర్లుగా, 10 సెక్టార్లుగా విభజించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో స్పెషల్​ కోర్సులను ప్రవేశపెడుతోంది.

కాగా 2024 నవంబర్​లో సాంకేతిక విద్యాశాఖ 32 కొత్త కోర్సులను రూపొందించింది. అయితే అందులోని మూడు కోర్సులను 10 పాలిటెక్నిక్‌ కళాశాలలో డిసెంబరు నుంచి ప్రారంభించారు. ఈ కళాశాలల్లో సుమారు 700 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగిలిన కోర్సులను సైతం క్రమంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అడిషనల్​ కోర్సులను చదివితే స్టూడెంట్​కి ఒక క్రెడిట్‌ ఇస్తున్నారు. తొలుత సిలబస్‌ను పరిశ్రమలకు పంపించి, వారి సూచనలతో అందులో మార్పులు, చేర్పులు చేస్తారు.

క్లస్టర్లను ఎలా విభజిస్తారంటే: ఉమ్మడి జిల్లాల ఆధారంగా క్లస్టర్లను విభజించారు. ఆయా ప్రాంతాలలో ఏ రంగం అభివృద్ధి చెందుతుందో చూసుకుని, అందుకు అనుగుణంగా పాలిటెక్నిక్‌లలో కోర్సులు తీసుకొస్తున్నారు.

  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం క్లస్టర్‌లోని పాలిటెక్నిక్‌లలో ఫార్మా కోర్సులను ప్రవేశపెట్టారు.
  • ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా కోర్సులు
  • గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టెక్స్‌టైల్స్‌
  • నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గ్రానైట్, ఆయిల్‌ ఉత్పత్తులకు సంబంధించిన కోర్సులు
  • చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్, సోలార్, విండ్​ పవర్
  • అనంతపురం, కడప జిల్లాల్లో ఆటోమొబైల్, సిమెంటు

100% నియామకాలే టార్గెట్​: పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 100% ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. గత సంవత్సరం 50% ఉద్యోగాలు కల్పించారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల్లో ఎక్కువమంది బీటెక్‌కు వెళ్తున్నారు. దీంతో పరిశ్రమల్లో పాలిటెక్నిక్​ చేసిన అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. మధ్య స్థాయిలో వర్క్​ చేసేవారు దొరకడంలేదు. దీంతో డిప్లొమా చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టారు.

  • ఏఐసీటీఈ (All India Council for Technical Education) ఉద్యోగంతోపాటు బీటెక్‌ చేసేందుకు అవకాశం కల్పించింది.

పాలిటెక్నిక్​లో క్యాంపస్ ప్లేస్​మెంట్స్​ను 3 రకాలుగా నిర్వహిస్తున్నారు.

  1. పాలిటెక్నిక్‌ లెవల్​లో ఏ కాలేజీకి ఆ కాలేజీ పరిశ్రమల యాజమాన్యాలను తీసుకొచ్చి క్యాంపస్ ప్లేస్​మెంట్స్ చేపడుతున్నాయి.
  2. క్లస్టర్‌ స్థాయిలోనూ రెండు, మూడు జిల్లాలకు కలిపి క్యాంపస్ ప్లేస్​మెంట్స్ చేపడుతున్నారు.
  3. అదే విధంగా రాష్ట్రస్థాయిలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు పరిశ్రమలను సంప్రదించి ప్లేస్​మెంట్స్ తీసుకొస్తున్నారు. తొలుత ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించి, ఆ తర్వాత ప్లేస్​మెంట్స్ చేపడుతున్నారు.

కొత్త కోర్సులు ఏ క్లస్టర్లలో అంటే:

  • మూడు క్లస్టర్లలో కొత్త కోర్సులను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో అడిషనల్​ కోర్సుగా నిర్వహిస్తున్నారు.
  • తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్‌లో ఆక్వా ఆటోమేషన్‌ అండ్‌ స్కాడా ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సుని తీసుకొచ్చారు.
  • చిత్తూరు జిల్లాలో ఆటోమేషన్‌ అండ్‌ పీఎల్‌సీ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌.
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఫార్మా ప్రాసెసింగ్‌ సేఫ్టీ.

రైల్వే భారీ నోటిఫికేషన్‌ - న్యూ ఇయర్‌లో 32,438 గ్రూప్-డి పోస్టులు భర్తీ!

ఉద్యోగం మీ లక్ష్యమా? - టాప్‌ టెన్‌ రంగాల్లో లక్షలాది అవకాశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.